గుంటూరు జిల్లా: చిలకలూరిపేట పట్టణంలో అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఒక వ్యక్తిని చిలకలూరిపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 25 బాటిల్లను మరియు బైక్ ను పట్టుకుని సీజ్ చేశారు.
ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో ఎడ్లపాడు పోలీసులతో కలిసి కొండవీడు కొండపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 1200 లీటర్ల బెల్లం ఊటను పట్టుకొన్నారు. పది లీటర్ల నాటుసారా పట్టుకున్నారు. రెండు బట్టీలను ధ్వంసం చేశారు. ఈ దాడులు ఎక్సైజ్ సీఐ నయనతార ఆధ్వర్యంలో నిర్వహించారు.