చిలకలూరిపేట: కరోనా వైరస్ విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అవగాహన లేక, కుటుంబాల్లో చూసే వాళ్ళు లేక ఇంట్లో ఒక్కల్లే ఉంటున్న వారు కొంతమంది అసువులు బాస్తున్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని కొల్లా రామారావు హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఒక ఇంటిలో రామారావు(60) వారం నుండి జ్వరం ఒళ్లు నొప్పులుతో బాధపడుతున్నాడు. వారి పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. అయితే గత వారం నుండి ఒళ్లునొప్పులు జ్వరంతో బాధపడుతూ ఈరోజు ఉదయం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అతనిని వారు చేర్చుకోలేదు.
అయితే ఇంటికి వచ్చిన అరగంటలో తుది శ్వాస విడిచాడు. అతను మృతి చెందాడని తెలుసుకొని మున్సిపల్ అధికారులకు చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేశారు. టెస్ట్లు చేపించుకోకుండా అనేక మంది తమ ప్రాణాలను వదులుతున్నారు. అతని మృతదేహాన్ని ఖననం చేయడానికి మున్సిపల్ సిబ్బంది కోసం చుట్టుపక్కల వారు ఎదురు చూస్తున్నారు.