చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఈ రోజు వరకు కరోనాతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.. గ్రామంలో నివసిస్తున్న టీ స్టాల్ నిర్వాహకుడు(60) వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో నర్సారావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అతని కుమారుడు(35) కూడా కరోనా పాజిటివ్ రావడంతో నరసరావుపేటలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఒకే కుటుంబంలో ఇరువురు మృతి చెందటంతో గ్రామంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఆ గ్రామంలో ఇప్పటి వరకు 27 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో ఇరువురు, సాతులూరు గ్రామంలో నలుగురు, గణపవరంలో ఒకరు మొత్తంమీద నాదెండ్ల మండలంలో మొత్తం మీద ఏడుగురు వ్యక్తులు కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.