728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 15, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు భారీగా కరోనా కేసులు నమోదు.. కరోనాతో మహిళ మృతి

గుంటూరు జిల్లా: చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు వివిధ ప్రాంతాల్లో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు, మండల ప్రాంతంలోని వేలూరు, గంగపాలెం గ్రామాల్లో రెండు పాజిటివ్ కేసులు, ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన ఒక మహిళ మృతి అనంతరం పాజిటివ్గా నమోదయ్యాయి.

చిలకలూరిపేట టౌన్:
పట్టణంలోని కళామందిర్ థియేటర్ వెనక బొబ్బల సత్యనారాయణ వీధిలోని ఒక యువకునికి, అలానే వడ్డెర కాలనీకి చెందిన ఒక యువకునికి, పండరీపురంలో నివసిస్తున్న ఒక వ్యక్తికి రెండో వార్డుకు చెందిన వార్డు వాలంటీర్ గా పని చేస్తున్న ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.

చిలకలూరిపేట రూరల్:
చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన ఒక యువకుడు ఈ నెల ఆరో తేదీన బెంగుళూరు నుంచి తన స్వగ్రామమైన వేలూరు గ్రామానికి వచ్చాడు. అనుమానం ఉండటంతో ఏడో తేదీన కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అతనికి పాజిటివ్ వచ్చినట్లు ఈరోజు అధికారులు నిర్ధారించారు. అలానే గంగంపాలెంకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి ఈ నెల 9వ తేదీన తన స్వగ్రామానికి వచ్చారు. అనుమానంతో పరీక్షలు చేయించుకున్న ఆ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారణ చేశారు.

ఎడ్లపాడు మండలం:
ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. మరణానంతర పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు భారీగా కరోనా కేసులు నమోదు.. కరోనాతో మహిళ మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE