728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 23, 2020

చిలకలూరిపేట మున్సిపల్ అధికారులపై ఆరోపణలు...కరోనా ఖర్చులపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు ⁉️

చిలకలూరిపేట: పట్టణంలో లాక్ డౌన్  పెట్టినప్పటి నుండి మొట్ట మొదట శివాలయం పక్క వీధిలో, రెండవది రజక వీధిలో, మూడోది చిన్నపీరుసాహెబ్ వీధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనల ప్రకారం 500 మీటర్లు, 200 మీటర్ల మేర ఆ ప్రాంతాన్ని ప్రభుత్వ అధికారుల ఆధీనంలోకి తీసుకుని అక్కడ కంటైన్మెంట్ జోన్ ను ఏర్పాటు చేశారు. ఒక మున్సిపల్ అధికారి, పోలీసులు, ఏ.ఎన్.ఎంలు, సచివాలయ అధికారులు, వాలంటీర్లు ఉండి పర్యవేక్షించిన విషయం విదితమే. పాజిటివ్ కేసు నమోదు అయిన ప్రాంతం నుంచి జనం బయటకు రాకుండా ప్రభుత్వం నిర్ణయించి 500, 200 మీటర్ల మేరకు అధికారులు కడ్డీలు కట్టి ఇనుప బారికేడ్లను పెట్టి దారులు మూసి వేశారు.

అలానే పట్టణంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ లోని వ్యక్తులకు కావలసిన  అల్పాహారం మరియు మంచినీళ్ళ బాటిల్ ను మున్సిపల్ వారు సరఫరా చేశారు. అయితే ఈ ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం కరోనా కు సంబంధించి ప్రత్యేక నిధి నుండి జిల్లా కలెక్టర్  మంజూరు చేసి మున్సిపల్ కార్యాలయం ద్వారా సంబంధిత కాంట్రాక్ట్  వ్యక్తులకు నిధులు మున్సిపల్ కార్యాలయం ద్వారా ఇవ్వవలసి ఉంది.

అయితే మున్సిపాలిటీ కు సంబంధించిన  జనరల్ ఫండ్ నుంచి  ఆయా పనులు మున్సిపల్ అధికారులు సుమారు 55 లక్షలు ఖర్చు చేసినట్లు పలువురు జిల్లా, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు  తెలుస్తుంది. ఇప్పటికీ పట్టణంలోని కోవిడ్ కేర్ సెంటర్ లో పాజిటివ్ పేషెంట్లకు మంచినీరు రోజుకు 3 లీటర్లే ఇస్తున్నట్లు  అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మనిషి రోజుకు 5 నుండి 6 లీటర్ల వరకు మంచినీరు తాగవల్సి  ఉండగా కేవలం మూడు లీటర్లు మాత్రమే నీరు ఇస్తున్నారని పేషెంట్లు అనేకమందికి ఫోన్లు చేసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఒక్కొక్క పేషెంటుకు 610 రూపాయల విలువైన భోజనం రోజు మొత్తం పెట్టాల్సి ఉండగా, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం రోజు మార్చి రోజు చికెన్ కానీ మటను గాని పెడుతున్నట్లు పేషెంట్లు చెబుతున్నారు. అయితే వాటిలో తమకు ఇవ్వాల్సిన ఆరోగ్యకరమైన  డ్రై ఫ్రూట్స్ గాని పళ్ళు ఏమీ ఇవ్వట్లేదు అని, కేవలం మూడు వందల రూపాయల విలువైన భోజనం మాత్రమే పెడుతున్నట్లు అనేకమంది జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఒక్కో కోవిడ్ పేషెంట్కు 3900 రూపాయల రోజువారి మందులకు ట్రీట్మెంట్కు మొత్తానికి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

అయితే మార్చి 24 వ తేదీ నుండి చిలకలూరిపేట లోని యాభై రెండు ఎకరాల్లో ఉన్న క్వారెంటైన్ సెంటర్, కోవిడ్ కేర్ సెంటర్ కు ఈ నెల 17వ తేదీ వరకు ఉదయం టిఫిన్, మంచినీరు, పిల్లలకు  పాలు తదితర అవసరాలకు 10 లక్షల రూపాయలు మున్సిపల్ కార్యాలయం ద్వారా ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెబుతున్నారు. ఈనెల 17 తర్వాత భోజనం సప్లై వారికి మంచి నీరు సప్లై చేయాలని మున్సిపల్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

అలానే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు  అనేక చోట్ల  ఏర్పాటు చేయక పోవటం, వీధి ని క్లోజ్ చేయక పోవడం ఏమిటని పలువురు  ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కోవిడ్ కు సంబంధించి పట్టణంలో బాగోగులు చూడవలసిన మున్సిపల్ అధికారి ఏదో అలా చుట్టం చూపుగా అప్పుడప్పుడు ఆ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో కరోనా  నియంత్రణ చేయలేకపోయారని కూడా పలు విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా పై సమస్యలు చెబుదామంటే ఫోన్ కూడా ఎత్తరు అని సదరు అధికారి పై అనేకసార్లు జిల్లా కలెక్టర్ కు ఆర్డీకు అనేకమంది ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలుస్తుంది.

అలానే కోవిడ్ కేర్ సెంటర్, కంటోన్మెంట్ జోన్లలో ఏర్పాటు చేసిన ఖర్చుల్లో  అనేక అవకతవకలు జరిగాయని అనేక ఆరోపణలు వెల్లువెత్తడంతో పట్టణంలోని ఒక పార్టీ కు చెందిన మాజీ కౌన్సిలర్, వివిధ పార్టీల నాయకులు కొంతమంది విజిలెన్స్ అధికారులకు మరియు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ విషయాలపై విజిలెన్స్ అధికారులు చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయానికి విచారణ నిమిత్తం రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కొన్ని ఫైల్ కు సంబంధించి ఆడిట్ కూడా చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. అయితే ఈ విషయాలు తెలుసుకున్న సదరు మున్సిపల్ అధికారి సెలవు పెట్టి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మున్సిపల్ అధికారులపై ఆరోపణలు...కరోనా ఖర్చులపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు ⁉️ Rating: 5 Reviewed By: NEWS UPDATE