728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 18, 2020

చిలకలూరిపేటలో అక్రమంగా సండ్రీ వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం: మున్సిపల్ కమిషనర్

చిలకలూరిపేట: పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో వసూలు చేస్తున్న సండ్రీ ఫీజుల విషయం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. గత నెల 30వ తేదీన సండ్రీ వేలం టెండరు నిలిపివేసిన పురపాలక సంఘం అధికారులకు కొత్త కొత్త ట్విస్టులు అగుపడుతున్నాయి.

రెండు రోజుల క్రితం పట్టణంలోని బోస్ రోడ్డు ప్రాంతంలో 2019 -20 సంవత్సరంతో ఉన్న రసీదుతో PVR సంతకంతో ఒక వ్యక్తి రూ.300 ఉన్న రసీదుతో రూ.150 రూపాయలు తీసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

చిలకలూరిపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో బిల్  కలెక్టర్ ల కింద అవుట్సోర్సింగ్ సిబ్బంది సండ్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. తోపుడు బండికి పది రూపాయలు, లారీకు  వంద రూపాయలు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సండ్రీ ఫీజులు మున్సిపల్ సిబ్బంది వసూలు చేస్తున్నారా... లేక బయట వ్యక్తులు వసూలు చేస్తున్నారా అనే విషయంపై మునిసిపల్ రెవెన్యూ అధికారులు వివరణ ఇస్తూ  మున్సిపల్ కార్యాలయం తరఫున ఎవరు 300 రసీదుతో సండ్రీ వసూలు చేయడం లేదని చెప్పారు.

మున్సిపల్ కార్యాలయం నుండి కాక బయట వ్యక్తులు మున్సిపల్ కార్యాలయం పేరుతో రసీదులు ముద్రించి ఈ విధంగా ఎన్ని రోజులుగా ఈ వసూళ్లు తతంగం చేస్తున్నారో... మున్సిపల్ కార్యాలయానికి ఎంత నష్టం జరిగిందోమరి. ఏప్రిల్ నెల నుంచి రోజుకు కొన్ని వేల రూపాయలు అక్రమంగా బయట వ్యక్తులు సండ్రీ వసూలు చేయడంతో పురపాలక సంఘ ఖజానాకు ఎంత గండి  పడిందో తేటతెల్లమౌతుంది.

దీనిపై సమగ్ర నివేదికను రెవెన్యూ అధికారికు ఇవ్వమని చెప్పామని మున్సిపల్ కమిషనర్  సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. నివేదిక రాగానే అక్రమంగా సండ్రీ వసూలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేస్తామని ఆయన తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో అక్రమంగా సండ్రీ వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం: మున్సిపల్ కమిషనర్ Rating: 5 Reviewed By: NEWS UPDATE