చిలకలూరిపేట: పట్టణ పరిధిలో నేడు మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా అధికారులు ధ్రువీకరించారు.
గత రెండు రోజుల క్రితం సిబ్బంది అందరూ నరసరావుపేటలో నిర్వహించిన పరీక్షల్లో టెస్ట్లు చేపించుకున్నారు. అయితే ఈ టెస్టుల్లో వీరిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక వ్యక్తి పట్టణంలోని పండరీపురంలో నివసిస్తుండగా, మరొక వ్యక్తి ప్రకాశం జిల్లా పర్చూరు నుండి విధులకు హాజరవుతూ ఉంటారు.