728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 17, 2020

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

అమరావతి:
★ రాష్ట్ర ప్రభుత్వం తమ మాట వినకపోవటం పై హైకోర్టు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

★ ఇప్పటికే కొన్ని విషయాల్లో హైకోర్టు చెప్పినా వినకపోవటంతో హైకోర్ట్ అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.

★ అయినా రాష్ట్ర ప్రభుత్వ తీరు మాత్రం మారటం లేదు.

★ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మళ్ళీ రాష్ట్రానికి ఎదురు దెబ్బ తగిలింది.

★ తనను ఎన్నికల కమీషనర్ గా నియమించమని ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం తన నియామకానికి అడ్డుపడుతుంది అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు.

★ దీనిపై ఈ రోజు వాదనలు జరిగాయి.

★ ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

★ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరుపు న్యాయవాది వాదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసిందని, మూడు సార్లు సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదని హైకోర్టు దృష్టికి తీసుకోచ్చారు.

★ సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోతే హైకోర్టు ఆదేశాలు ఫైనల్ అవుతాయని కోర్టు దృష్టికి తెచ్చారు.

★ ఈ వాదనతో హైకోర్టు కూడా ఏకీభవించింది.

★ ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది.

★ వెంటనే గవర్నర్ ను కలిసి తనను అపాయింట్ చెయ్యల్సిందిగా, అడగాలి అంటూ రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాలు జరీ చేసింది.

★ అదే విధంగా సుప్రీం కోర్టులో మూడు సార్లు స్టే రాకపోవటంతో నిమ్మగడ్డకు ఏ ఉత్తర్వులు తాము ఇచ్చామో ఆ ఉతర్వులు అమలులో ఉన్నట్టు భావించాలి అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

★ హైకోర్టు తీర్పు ప్రతిని గవర్నర్ కు అందించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నియామక పత్రం ఇవ్వాలని కోర్టు తెలిపింది.

★ వచ్చే శుక్రవారానికి ఈ కేసు వాయిదా వేసిన కోర్టు, ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది.

★ ఈ సందర్భంగా నిమ్మగడ్డ రెండు మూడు రోజుల్లో, ఆయన గవర్నర్ ని కలిసే అవకాశం ఉంది.

★ వచ్చే వారానికి వాయిదా ఉండటంతో, రాష్ట్ర గవర్నర్ ఎలా స్పందించారు అనే విషయం కోర్టు దృష్టికి తెలిపే అవకాశం ఉంది.

★ మరో పక్క ఇప్పటికే నిమ్మగడ్డ, 15 రోజులు క్రితం గవర్నర్ కు లేఖ రాసినా గవర్నర్ వైపు నుంచి ఎలాంటి స్పందన ఇప్పటి వరకు రాలేదు.

★ మరి కోర్టు తీర్పు దృష్టిలో పెట్టుకుని గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ Rating: 5 Reviewed By: NEWS UPDATE