728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 14, 2020

చిలకలూరిపేటలో 11 గంటల వరకు మాత్రమే షాపులు... 144 సెక్షన్ అమలు

చిలకలూరిపేట: పట్టణంలో లాక్ డౌన్ ఎత్తి వేసిన అనంతరం ఉదయం 6 నుండి 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని గతంలో అధికారులు తెలియజేసిన విషయం విదితమే.

అయితే శుక్రవారం 14వ తేదీ నుండి ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాసరావు, అర్బన్ సి.ఐ టి.వెంకటేశ్వర్లు, తహసిల్దార్ సుజాత మీడియాకు తెలిపారు.

11 గంటల అనంతరం రాత్రి 10 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, రాత్రి పది గంటల నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నియమ నిబంధనలు ఈ నెల 19వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో 11 గంటల వరకు మాత్రమే షాపులు... 144 సెక్షన్ అమలు Rating: 5 Reviewed By: NEWS UPDATE