728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 14, 2020

'స్టేటస్‌కో'పై 17న సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ:
★ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల‌ ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాల‌పై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోపై వచ్చే సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

★ మూడు రాజధానుల‌ ఏర్పాటు, సీఆర్డీఏ రద్దును వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.

★ వీరి పిటీషన్లును విచారించిన హైకోర్టు న్యాయస్థానం ఈ నెల‌14వ తేదీ వరకు స్టేటస్‌కో విధించింది.

★ దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

★ హైకోర్టు విధించిన స్టేటస్‌కోను ఎత్తివేయాల‌ని తమ పిటీషన్‌లో పేర్కొంది.

★ అయితే వాస్తవానికి ఈ పిటీషన్‌ ఎప్పుడో విచారణకు రావాల్సి ఉంది.

★ అయితే ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌లో తప్పులు ఉండడంతో ఇది వాయిదాపడింది.

★ కాగా సోమవారం నాడు స్టేటస్‌కో, అమరావతిలో ఇళ్ల స్థలా పంపిణీ, ఆర్‌-5 జోన్లపై దాఖలైన వాజ్యాల‌ను కూడా న్యాయస్థానం విచారించబోతోంది.

★ హైకోర్టు ఇఛ్చిన స్టేటస్‌కోను సుప్రీంకోర్టు కొట్టివేస్తే..వెంటనే ‘విశాఖ’లో పాల‌నారాజధానికి శంఖుస్థాపను చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

★ ఇప్పటికే ఆ మేరకు అక్కడ ఏర్పాట్లు చేసుకుంది.

★ సోమవారం నాడు కనుక సుప్రీం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఈ మాసంలోనే విశాఖలో రాజధానికి శంఖుస్థాపన చేస్తారని కొంత మంది సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

★ ఒక వేళ హైకోర్టు తీర్పునే సుప్రీం సమర్థిస్తే... దసరా సమయానికి కోర్టులో ఉన్న పిటీషన్లు పరిష్కరించుకుని.. రాజధాని శంఖుస్థాపన చేయాల‌ని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

★ మొత్తం మీద..17న సుప్రీంలో రానున్న తీర్పు ఇరు పక్షాల‌కు కీల‌కమైనద‌నడంలో ఎటువంటి సందేహం లేదు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 'స్టేటస్‌కో'పై 17న సుప్రీంలో విచారణ Rating: 5 Reviewed By: NEWS UPDATE