చిలకలూరిపేట: గుంటూరు జిల్లాలో గతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిబంధనలు యధాతధంగా అమల్లో ఉంటాయని చిలకలూరిపేట ఇన్చార్జి తాసిల్దార్ సుజాత తెలిపారు. గతంలో తహసీల్దార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ లో 19వ తేదీ వరకు ఆంక్షలు ఉంటాయని ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 144 సెక్షన్ ఉంటుందని తెలియజేసిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం 20 తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా అమలులో ఉన్నట్టే ఆంక్షలు అమల్లో ఉంటాయని చిలకలూరిపేటలో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరుచుకోవాలని, 144 సెక్షన్ ను ఎత్తి వేస్తున్నట్లు తహసిల్దార్ సుజాత తెలిపారు. రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు వచ్చేంత వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చిలకలూరిపేట ఇంచార్జ్ తహసిల్దార్ సుజాత తెలిపారు.