★ టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
★ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
★ ప్రస్తుతం ఆయన కడప జైల్లో ఉన్నారు.
★ జైల్లో ఉండగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
★ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్‌రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు.
★ దీంతో ఆయనకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ను అనంతపురం కోర్టు మంజూరు చేసింది.
★ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్నారు.
★ అనంతరం బెయిల్‌పై విడుదలై ఇంటికొస్తుండగా కోవిడ్ నిబంధనల మేరకు వాహనాల అనుమతికి ఓ పోలీస్ అధికారి అనుమతి ఇవ్వలేదు.
★ దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు.
★ పోలీస్ అధికారి ఫిర్యాదుతో ఆయనపై మళ్లీ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కడప జైలుకు తరలించారు.
★ జైల్లో ఉండగా కరోనా వైరస్ సోకింది. ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతారో తెలియాల్సి ఉంది.

