728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 19, 2020

ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

అమరావతి:
★ సామాగ్రి అపహరణ కేసులో ఎమ్మెల్యే మద్దాలి గిరి, గుంటూరు అర్బన్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

★ శంకర్ విలాస్ సెంటర్‌లోని డీబీ ఫ్యాషన్‌పై కొందరు దౌర్జన్యం చేశారు.

★ తాళాలు పగలగొట్టి రూ. కోటీ యాభై లక్షల విలువ చేసే సామాగ్రిని అపహరించారు.

★ దీనిపై బాధితులు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పట్టించుకోలేదు.

★ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే ఎస్పీ కూడా స్పందించలేదు.

★ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో బాధితుడు కొప్పురావూరి శివ ప్రసాద్ చివరికి హైకోర్టును ఆశ్రయించాడు.

★ ఎమ్మెల్యే మద్దాలి గిరి వత్తిడి కారణంగానే పోలీసులు మౌనం వహిస్తున్నారని, తన షాపులో సామాగ్రిని అపహరించిన వారికి ఎమ్మెల్యే మద్దాలి గిరి మద్దతు ఉందని బాధితుడు శివ ప్రసాద్ తన పిటిషన్‌లో ఆరోపించాడు.

★ తన షాపును వారు ఆక్రమించుకునేందుకు చూస్తున్నారని, అందులో భాగంగానే తనను వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నాడు.

★ వారికి మద్దతుగా ఎమ్మెల్యే మద్దాలి గిరి అండగా ఉండి వత్తిడి చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు.

★ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం ఎమ్మెల్యే గిరితో సహా పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి నోటీసులు జారీ చేసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE