728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 19, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీగా తగ్గిన కేసులు!

చిలకలూరిపేట: నియోజకవర్గ స్థాయిలో ఈరోజు గత రెండు నెలల నుండి నమోదైన కరోనా కేసులు కంటే అతి తక్కువ కరోనా కేసులు నమోదైన రోజు.  ఇప్పటివరకు నియోజకవర్గం మొత్తం మీద రోజుకు 10 నుంచి 40 కేసుల వరకూ నమోదయ్యాయి. కానీ, ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి.

ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో 1 కరోనా కేసు, చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామంలో 1 కేసు నమోదు కాగా, నాదెండ్ల మండలంలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు.

అయితే, చిలకలూరిపేట మండలంలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. జిడ్డు కాలనీలో ఒక పాజిటివ్ కేసు నమోదయింది. మొత్తంమీద నియోజకవర్గ స్థాయిలో, మండలాల్లో, పట్టణంలో మొత్తం మీద 3 కరోనా కేసులు మాత్రమే ఈరోజు నమోదు కావడంతో నియోజకవర్గ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీగా తగ్గిన కేసులు! Rating: 5 Reviewed By: NEWS UPDATE