అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,16,003 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 86,725 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 8,061 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 2,26,372 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 86 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,906 కు చేరింది. ఏపీలో ఇప్పటవరకు 30,19,296 మందికి పరీక్షలు చేశారు.
August 19, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో 9,742 కొత్త కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

