728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 19, 2020

ప్రజల సమస్యలు మీకు కనిపించవా?: పేట అఖిలపక్షం

చిలకలూరిపేట: స్థానిక సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు, ముఖ్యంగా రాష్ట్రంలో  దళిత, బీసీ, గిరిజన, మైనార్టీ వర్గాలపై అధికారులను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నాయకులు జరుపుతున్న పైశాచిక దాడులు, అక్రమ కేసులను తీవ్రంగా ఖండించిన అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళిత, మైనార్టీ మహిళా బాలికలపై అత్యాచారాలు జరిపి, పోలీసుస్టేషన్ కు కుతా వేటు దూరంలో పడవేస్తున్న, స్పందించలేని స్థితిలో రాష్ట్ర హోంమంత్రి ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఏదైనా చిన్న కార్యక్రమం చేసిన, జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసే మహిళా శాసన సభ్యురాళ్లు మహిళా కమిషన్ చైర్మన్ మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించ లేని నియంత నిర్బంధంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు తదితర అధికార పార్టీ నాయకులు ఉన్నారని అఖిలపక్ష నాయకులు ఎద్దేవా చేశారు.

మైనార్టీ తీరని మహిళ బాలికలపై మనిషి రూపంలోని మృగాలు అతి కిరాతకంగా గదిలో 5రోజుల పాటు నిర్బంధించి వరుస దాడులకు పాల్పడితే స్పందించని హోంమంత్రి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆఘమేఘాల మీద స్పందించడం దురదృష్టకరమన్నారు, ఇకనైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పంతాలు మాని ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డికి లేఖ ద్వారా అఖిలపక్ష నాయకులు సూచించారు, చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగంలో విబేధాలు, రెవెన్యూ, మెఫ్మ, జనరల్ ఫండ్ లలో గోల్ మాల్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని అఖిలపక్ష నాయకుల డిమాండును, వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ శ్యామల్ ఆనందకు విన్నతి పత్రం ద్వారా కోరిన అఖిలపక్ష నాయకులు.

పట్టణ ప్రాంతాల్లో కరోన వైరస్ బారిన పడిన వారిపట్ల, కోవిడ్ సెంటర్ నిర్వహణ పట్ల మున్సిపల్ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కరోనా సాకుతో పట్టణంలోని పారిశుద్ధ్యం ఆటకెక్కించారన్నారు, పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారై సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు, వైరల్ వ్యాధుల బారిన పడిన వారికి ప్రేవేట్ వైద్యశాలల్లో చికిత్సను నిరాకరిస్తున్నారని, సిఫార్సులతో ఒకవేళ ప్రేవేట్ వైద్యశాలల్లో చికిత్స అందించిన టెస్టుల పేరుతో వేల రూపాయలు దోపిడీ చేస్తున్నారని, అఖిలపక్ష నాయకుల ఆరోపించారు, మునిసిపల్ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాసరావుకు సమస్యలు విన్నవించుకుందామన్న కరోనా సాకు చూపి ప్రజాలకు, ప్రజా సంఘాల నాయకులకు కనీసం ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా కరోనా పేరుతో అక్రమార్జన కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని అఖిలపక్షం ఆరోపణలు చేశారు.

ఈ సమావేశంలో సీపీఐ, సిపీఎం, కాంగ్రెస్, టీడీపీ, బహుజన సమాజ్, లోక్ సత్త, మాదిగ దండరో, ఎమ్ఐఎమ్, ముస్లిం సంక్షేమ సంఘం, హుమ్యాన్ రైట్స్, జనక్రాంతి, నవతరం, ఎస్సి ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఐఖ్య సంఘాల నాయకులు, సీఆర్ మోహన్, ఏం రాధాకృష్ణ, మురుకొండ మల్లిబాబు, ఏఎస్ఎన్ రాజు, పేరుబోయిన వెంకటేశ్వర్లు, ఏం బానుప్రసాద్, నల్లపు కోటి, అడపా మోహన్, ఛాన్ బాషా, మునాఫ్, షేక్ బాజి, షేక్ గౌస్, ఖాన్, కోటేశ్వరరావు, రాజా, ఏ వినయరాజ్, సాతులూరి బాబు, షేక్ సుభాని, పేలురి రామారావు, కేశవ నాయక్, నాగభైరు సుబ్భయమ్మ, చెరుకుపల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రజల సమస్యలు మీకు కనిపించవా?: పేట అఖిలపక్షం Rating: 5 Reviewed By: NEWS UPDATE