728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 19, 2020

జగన్ ఒక్కచాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు: నారా లోకేష్

అమరావతి:
🔷 జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసం.

🔷 ఒక పక్క కరోనా, మరో పక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని గాలికొదిలి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు.

🔷 కేవలం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే జేసీ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు.

🔷 ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకులపై కరోనా కేసులు పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయారు అంటే ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం అవుతుంది.

🔷 జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ పై రిలీజ్ అయిన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్ళీ అరెస్ట్ చేసారు.

🔷 ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరం.

🔷 జేసి ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి నేర మనస్తత్వమే కారణం.

🔷 కడప జైలులో 317 మందికి కరోనా ఉన్నట్టు నిర్దారణ అయ్యింది.

🔷 తక్షణమే ఆసుపత్రికి తరలించి, జేసీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్య సహాయం అందించాలి.

🔷 జేసీ ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేసారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జగన్ ఒక్కచాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE