728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 20, 2020

రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ:
🔷 మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ 76వ జ‌యంతి సంద‌ర్భంగా గురువారం ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. 

🔷 1944 ఆగ‌ష్టు 20న ముంబైలో రాజీవ్‌ గాంధీ జ‌న్మించారు. 

🔷 1984 అక్టోబ‌రులో ఆయ‌న దేశ ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 

🔷 అతి చిన్న వ‌య‌సులోనే ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ రికార్డు కూడా ఆయ‌న‌దే. 1989 డిసెంబ‌ర్ 2 వ‌ర‌కూ ప్ర‌ధానిగా ప‌ని చేశారు రాజీవ్ గాంధీ. 

🔷 కాగా మే 1991లో త‌మిళనా‌డులోని శ్రీపెరంబుదూర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో లిబ‌రేష‌న్ టైగ‌ర్స్ ఆఫ్ త‌మిళ ఈలం జ‌రిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాందీ మృతి చెందారు. 

🔷 ఈ రోజును కాంగ్రెస్ పార్టీ స‌ద్భావ‌న దివాస్‌గా పాటిస్తున్న విష‌యం తెలిసిందే.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన ప్ర‌ధాని మోదీ Rating: 5 Reviewed By: NEWS UPDATE