అమరావతి: ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ. 24 గంటల్లో కొత్తగా 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,81,817 కు చేరింది. ప్రస్తుతం 88,138 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 10,414 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 1,91,117 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 87 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,562 కు చేరింది. ఏపీలో ఇప్పటవరకు 28,12,197 మందికి పరీక్షలు చేశారు.
August 15, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: 24 గంటల్లో 8,732 కేసులు... 87 మరణాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

