728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 15, 2020

ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈ స్వాతంత్రం: ఎమ్మెల్యే రజిని

చిల‌క‌లూరిపేట‌: పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో శ‌నివారం స్వాతంత్య్ర దినోత్స‌వ సంబ‌రాలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండా ఎగుర‌వేశారు. మిఠాయిలు పంచారు. అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంద‌రో మ‌హానుభావుల త్యాగాల ఫ‌లితంగానే మ‌నం ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చ‌గ‌లుగుతున్నామ‌న్నారు. స్వాతంత్య్ర సాధ‌న కోసం ప‌నిచేసిన నాయ‌కుల‌ను మ‌నం ఎప్ప‌టికీ మ‌రిచిపోకూడ‌ద‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం నిజాయితీగా ప‌నిచేస్తోంద‌న్నారు. ప్ర‌జాక‌ర్ష‌క పాల‌న అందిస్తున్నామ‌న్నారు. మ‌హ‌నీయుల త్యాగాల‌కు త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విలువ‌ను తెచ్చేలా అద్భుతమైన పాల‌న అందిస్తున్నార‌ని కొనియాడారు.


ఈ కార్య‌క్ర‌మంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న, వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ‌ అధ్య‌క్షులు ప‌ఠాన్ త‌ల్హాఖాన్‌, క‌ల్లూరి బుజ్జి, జి.శ్రీనివాస‌రెడ్డి, డి.శంక‌ర‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు, పార్టీ అధికార ప్రతినిధి షేక్ దరియవలి, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి, బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి వీరాంజనేయులు, యస్.టి సెల్ అధ్యక్షుడు బాలకోటి నాయక్, నాయకులు కొలిశెట్టి శ్రీనివాసరావు, రత్నారెడ్డి, అంజిరెడ్డి, తోట బ్రహ్మస్వాములు, అల్లిమియా, ఆయా వార్డుల కౌన్సిల‌ర్ అభ్య‌ర్థులు, సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈ స్వాతంత్రం: ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE