728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 22, 2020

చిలకలూరిపేటలో తెలంగాణ మ్యాన్షన్ హౌస్ @ 250/-

చిలకలూరిపేట: నియోజకవర్గంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిద్ర నటిస్తున్నారా..? నిన్న మొన్నటి వరకూ తెలంగాణకు చెందిన మద్యం నియోజకవర్గంలో ఏరులై పారుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చినా అరకొర కేసులతో తమ విధులు నిర్వహించినట్లు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం చిలకలూరిపేటలోని పలు ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన మ్యాన్షన్ హౌస్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ తక్కువ ధరకు కొంతమంది అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీలో మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ బాటిల్ రూ.350 కాగా, తెలంగాణలో మ్యాన్షన్ హౌస్ రూ.160 విక్రయిస్తున్నారు.

చిలకలూరిపేట వైన్ షాపుల్లో 350 రూపాయలకు మ్యాన్షన్ హౌస్ క్వాటర్ కొనే బదులు తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్న కొంతమంది వద్ద కేవలం 250 నుండి 280 రూపాయలకే లభ్యమవుతుంది. అలానే  తెలంగాణ నుంచి చీప్ లిక్కర్ అయిన ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ కూడా రూ.150 వరకు చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ఈ అధిక ధరలను ఆసరా చేసుకుని పట్టణంలోని సుగాలికాలనీ, అడ్డ రోడ్డు సెంటర్, కుమ్మరి కాలనీ, సంత బజార్, ఎన్టీఆర్ కాలనీ, కృష్ణ మహల్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

అలానే ఎడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల మండలాలకు చెందిన సొలస, లింగంగుంట్ల, కావూరు, కారుచోల, సాతులూరు, తిమ్మాపురం, మురికిపూడి, ఎడ్లపాడు, నాదెండ్ల, బోయపాలెం, వేలూరు, పసుమర్రు గ్రామాల్లో కూడా ఈ యొక్క తెలంగాణ మ్యాన్షన్ హౌస్ మద్యం అమ్ముతున్నారని జిల్లా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళినట్లు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజుల్లో మద్యం ధరలు 30శాతం మేరకు తగ్గిస్తారు  అనే వార్తలు రావడంతో... తెలంగాణ నుంచి కొంతమంది తెచ్చి డంప్ చేసిన మ్యాన్షన్ హౌస్ మరియు ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ చౌకగా అమ్ముతున్నట్లు చర్చించుకుంటున్నారు.

అయితే మద్యం షాపులు లేనప్పుడు అరకొరగా కేసులు పెట్టిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చిలకలూరిపేట అధికారులు ఇంత తతంగం జరుగుతున్నా ఏమి తెలియనట్లు ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు  తెలంగాణ మద్యం చిలకలూరిపేటలో విక్రయిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో తెలంగాణ మ్యాన్షన్ హౌస్ @ 250/- Rating: 5 Reviewed By: NEWS UPDATE