చిలకలూరిపేట: కరోనా వైరస్ వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొద్ది నెలలుగా వినాయక ప్రతిమలను తయారుచేసి వినాయక చవితి పండగ 15 రోజులు ముందు నుండే విగ్రహాలను అమ్ముకుంటూ సంవత్సరం మొత్తం పొట్ట పోసుకునే కొన్ని కుటుంబాలు ఈ కరోనా వైరస్ దాటికి ఛిద్రం అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో ప్రతియేటా అడ్డరోడ్డు సెంటర్, నర్సారావుపేట సెంటర్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి నాలుగు నెలలు ముందే కొన్ని కళాకారుల కుటుంబాలు వచ్చి వందల సంఖ్యలో వినాయకుని విగ్రహాలు తయారు చేసేవారు. సుమారు మూడు నుంచి పది అడుగుల వరకు విగ్రహాలు తయారు చేసి గుంటూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ యొక్క వినాయక విగ్రహాలు అమ్మేవారు. ఈ విగ్రహాలను తయారు చేసి అమ్మే వారి మీద సుమారు 50 కుటుంబాలు ఆధారపడి ఉంటున్నారు.
కానీ ఈ కరోనా వల్ల ప్రభుత్వం వినాయకచవితి పండుగలను బయట ఏర్పాటు చేయకుండా ఇళ్లలోనే మట్టి ప్రతిమలతో చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం వల్ల తాము చేసిన చిన్నపాటి విగ్రహాలు కూడా ఎవరు కొనడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి శుభకార్యంలో తొలి పూజలు అందుకునే వినాయకునికి కూడా ఈ కరోనా సెగ తాకింది. పట్టణంలో ప్రతి వీధిలో, చిన్న చిన్న గల్లీల్లో కూడా వినాయక విగ్రహాలు పెట్టి పూజ చేసే అవకాసం లేకపోవడం వల్ల బొజ్జగణపయ్య భక్తులు నిరాశ చెందుతున్నారు.