అమరావతి:
★ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది.
★ జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమిటీకి ప్రత్యేక ఉప సంఘాలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు.
★ వివిధ అంశాలపై నాలుగు ఉప సంఘాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
★ జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధ్యతను మొదటి సబ్ కమిటీకి అప్పగించారు.
★ సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలు రెండో ఉప సంఘం చూడనుంది.
★ మూడో సబ్ కమిటీకి ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనం విధులు అప్పగించారు.
★ సాంకేతిక సంబంధిత అధ్యయనాన్ని నాలుగో సబ్ కమిటీకి కేటాయించారు.
★ రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
★ కలెక్టర్ ఛైర్మన్‌గా పది మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది.
★ రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తున్నారు.
★ వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
★ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.