చిలకలూరిపేట: నియోజకవర్గం పరిధిలోని రూరల్ మండలంలో గంగపాలెం గ్రామంలో ఇద్దరికి, గోవిందపురంలో ఒకరికి, పసుమర్రు గ్రామంలో ముగ్గురికి మరో గ్రామంలో ఇద్దరికీ, మొత్తం మీద రూరల్ మండలంలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఎడ్లపాడు మండలంలో ఈ రోజు ఒకే ఒక కరోనా కేసు నమోదైంది. నాదెండ్ల మండలంలో అమీన్ సాహెబ్ పాలెం గ్రామంలో ఒకరికి, కనపర్తి గ్రామంలో ఒకే కుటుంబంలో ఇరువురి వ్యక్తులకు కరోనా వచ్చింది. మొత్తం మీద ఈ రోజు నియోజకవర్గ పరిధిలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.