728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 10, 2020

సెప్టెంబర్ 30 దాకా రైళ్లు బంద్‌

న్యూఢిల్లీ:
★ కరోనా మహమ్మారి దేశాన్ని ప్రస్తుతం వణికిస్తోంది.

★ నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి.

★ ఈ క్రమంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

★ సాధారణ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌, ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దును వచ్చే నెల (సెప్టెంబర్‌) ౩౦వ తేదీ వరకు పొడగించినట్లు తెలిపింది.

★ ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తాయని పేర్కొంది.

★ ప్రయాణీకులు కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వేశాఖ సూచించింది.

★ ఇంతకు ముందు ఆగస్టు 11 వరకు రైళ్ల రద్దును పొడగించింది.

★ అలాగే ముంబైలో సిబ్బంది కోసం సబర్బన్‌ రైళ్లు నడవనున్నాయి.

★ ప్రస్తుతం దేశంలో 6,34,945 కరోనా యాక్టివ్‌ కేసులుండగా, 15,35,743 డిశ్చార్జి కేసులున్నాయి.

★ వైరస్‌ ప్రభావంతో 43,386 మంది చనిపోయారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సెప్టెంబర్ 30 దాకా రైళ్లు బంద్‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE