న్యూఢిల్లీ:
★ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పటికీ, చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షల నిర్వహణ తప్పనిసరి అని.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది.
★ అలా కాని పక్షంలో సదరు డిగ్రీలను గుర్తించబోమని కూడా హెచ్చరించింది.
వివరాలు ఇలా ఉన్నాయి...
★ డిగ్రీ, పీజీ చివరి సంవత్సర విద్యార్థులకు సెప్టెంబరు 30 లోగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ, విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.
★ కాగా, కొవిడ్-19 నేపథ్యంలో చివరి సంవత్సరం పరీక్షలు కూడా రద్దు చేయాలని దిల్లీ, మహారాష్ట్ర విశ్వవిద్యాలయాలు నిర్ణయించుకున్నాయి.
★ ఈ మేరకు సుప్రీం వద్ద అఫిడవిట్‌ను దాఖలు చేశాయి.
★ అంతేకాకుండా, కమిషన్ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు కేసులు నమోదయ్యాయి.
★ ఈ అంశంపై విచారణను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చేపట్టింది.
★ ఈ నేపథ్యంలో, పరీక్షలను రద్దు చేయటం విద్యార్థులకు మేలు చేయదని.. యూజీసీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి నేడు విన్నవించారు.
★ కాగా, కమిషన్ నిర్ణయం రాజ్యాంగం, చట్టానికి అనుగుణంగా లేదని ఆయా విశ్వవిద్యాలయాలు వాదించాయి.
★ ఈ అంశంపై ప్రత్యుత్తరమిచ్చేందుకు కమిషన్‌కు వ్యవధినివ్వాల్సిందిగా తుషార్ మెహతా కోర్టును కోరారు.
★ ఇందుకు సమ్మతించిన సర్వోన్నత న్యాయస్థానం, కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.