ముంబయి:
★ కొద్ది క్షణాల్లో ఆత్మహత్యకు పాల్పడబోతున్న వ్యక్తిని రెండు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా కృషి చేసి పట్టుకొని అతని ఆత్మహత్య ఆలోచనను చంపేశారు.
అసలు ఏం జరిగిందంటే..
★ ఢిల్లీకి చెందిన ఓ 27 ఏళ్ల వ్యక్తి కరోనా లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యారు.
★ దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
★ ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు.
★ వెంటనే అప్రమత్తమైన ఫేస్‌బుక్ సిబ్బంది ఈ విషయాన్ని ఢిల్లీ డీసీపీ అన్యేష్ రాయ్‌కి మెయిల్ ద్వారా తెలియజేసింది.
★ రాత్రి 8గంటల ప్రాంతంలో మెయిల్ రావడంతో అప్రమత్తమైన డీసీపీ... ఫోన్ నెంబర్‌ను ట్రేస్ చేసి అడ్రస్ కనుకున్నారు.
★ అయితే అక్కడ మరో ట్విస్ట్ ఎదురైంది.
★ ఆ నెంబర్ తన భర్తది అని ఓ మహిళ తెలియజేసింది.
★ తనతో గొడవపడి భర్తతో ఎక్కడికో వెళ్లాడని, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదని ఆమె చెప్పింది.
★ ఆయన నెంబర్‌ను తాను వినియోగిస్తున్నానని, అతనికి మరో నెంబర్ ఉందని అది వారికి ఇచ్చింది.
★ గతంలో ఆయన ముంబైలోని ఓ చిన్న హోటల్‌లో కుక్‌గా పనిచేసేవాడని పేర్కొంది.
★ దీంతో ఢిల్లీ డీసీపీ వెంటనే ముంబై డీసీపీ రష్మి కరాండికర్‌ను సంప్రదించారు.
★ కొత్త ఫోన్ నెంబర్‌ను వారికి ఇచ్చి ట్రేస్ చేయాలని కోరారు.
★ ముంబై పోలీసులు ఆ నెంబర్‌కు ఫోన్ చేయగా.. కలవలేదు.
★ వెంటనే ముంబై పోలీసులు అతని తల్లిని సంప్రదించారు.
★ ఆమెకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసినట్లు గుర్తించి ఆ నెంబర్‌ను ట్రేస్ చేశారు.
★ అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ముంబై పోలీసులు అతని అడ్రస్ కనుగొన్నారు.
★ అతన్ని ఫోన్ చేసి మాటల్లో పెట్టిన ముంబై పోలీసులు.. లోకేషన్ ట్రేస్ చేసి అతన్ని పట్టుకున్నారు.
★ అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
★ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు.