అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో కొత్తగా 9,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,06,261 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 9,211 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 2,18,311 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 88 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,820 కు చేరింది. ఏపీలో ఇప్పటవరకు 29,61,6111 మందికి పరీక్షలు చేశారు.
August 18, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

