అమరావతి: ఏపీలో కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,551 మందికి పరీక్షలు నిర్వహించగా 9,393 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,25,396 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,177 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 8,846 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 2,35,218 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 95 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,001 కు చేరింది.