అమరావతి: విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో జరిగిన అగ్రిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్.జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఇదివరకే ఆదేశాలు ఇచ్చారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో కోవిడ్ పేషెంట్లను ఉంచగా, అందులో అగ్నిప్రమాదం సంభవించి పలువురు మరణించిన ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
August 9, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

