అమరావతి: విజయవాడ ఒక హోటల్లో అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు ఫోన్ చేశారు. ఈ ఘటనపై వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. ఓ ప్రైవేటు హాస్పిటల్ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు ఉంచిందని, తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు, దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఇదివరకే అధికారులను ఆదేశించామన్నారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామని ప్రధాని మంత్రికి సీఎం తెలిపారు.
August 9, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: అగ్ని ప్రమాద ఘటనపై సీఎంకు ప్రధాని ఫోన్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

