న్యూఢిల్లీ:
★ భారత్‌లో కరోనా వైరస్‌తో మరణిస్తున్న వారి సంఖ్య కలవరపెడుతోంది.
★ నిత్యం దేశంలో దాదాపు 1000 మంది కొవిడ్ రోగులు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది.
★ గడిచిన 24 గంటల్లో మరో 944 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.
★ దీంతో ఆదివారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 49,980 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
★ ఇక పాజిటివ్ కేసుల పెరుగుదల రోజురోజుకు కొనసాతూనే ఉంది.
★ దేశంలో నిత్యం దాదాపు 60వేల మంది ఈ వైరస్ బారినపడుతున్నారు.
★ నిన్న ఒక్కరోజే కొత్తగా మరో 63,490 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
★ దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,89,682 కు చేరింది.
★ వీరిలో ఇప్పటివరకు 18లక్షల 62వేల మంది కోలుకున్నారు.
★ మరో 6లక్షల 77వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.
★ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్ నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య కూడా పెరుగుతోంది.
★ నిన్న మరో 53వేల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
★ ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 71శాతం దాటగా మరణాల రేటు దాదాపు 1.9శాతంగా ఉంది.
★ కొవిడ్ మరణాల్లో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో కొనసాగుతోంది.