ఈఎస్ఐ కింద నమోదైన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 3నెలల పాటు 50శాతం జీతపు అడ్వాన్సులు ఇచ్చేందుకు తీసుకున్న తాజా నిర్ణయం పట్ల నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఆయా పరిశ్రమలలోని 40లక్షల మంది కార్మికులకు లబ్ది జరగునందని వెల్లడించారు. లాక్ డౌన్ తో పరిశ్రమలు మూతబడి ఇబ్బంది ఎదుర్కుంటున్న కార్మికులకు దన్నుగా అడ్వాన్సులు ఇస్తుండటం పట్ల ఎంపీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కి ఆదివారం లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో కార్మికులకు అడ్వాన్స్ లు, పరిశ్రమలకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ ల గురించి లేఖలు ద్వారా కేంద్రానికి విన్నవించారు.
లాక్ డౌన్ సమయంలో రాసిన లేఖ:
దేశ వ్యాప్తంగా ఈఎస్ఐ స్కీం కింద 3.6 కోట్ల మంది కార్మికులు నమోదయ్యి ఉన్నారని తెలిపారు. వీరికి ఈఎస్ఐ స్కీంలో ఉన్న రూ.90,000కోట్లను వాడుకుంటూ 2 నెలల జీతాన్ని అడ్వాన్స్ గా ఇవ్వాలని కోరారు. ఈ సాయం ద్వారా ఈ కార్మికుల కుటుంబాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధార పడి ఉన్న 14కోట్ల మందికి లబ్ది జరుగుతుందని చెప్పారు. ఈ ఆర్థిక చేయూత వల్ల ఆదాయం లేక ఇబ్బంది ఎదుర్కుంటున్న సూక్ష్మ, స్థూల పరిశ్రమలకు ఊతం ఇచ్చినట్లవు తుందని పేర్కొన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకో గలదని విన్నవించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విన్నపానికి సానుకూల స్పందన లభించింది. కేంద్ర కార్మిక శాఖ కార్మికులను ఆదుకునేందుకు ఈఎస్ఐ స్కీం కింద ఉన్న కార్మికులు మార్చి 24 నుండి డిసెంబర్ 31 మధ్య కాలంలోని ఎదైనా 3 నెలలకు 50శాతం జీతాన్ని తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వడం కార్మికులకు ఎంతో మేలు జరిగే విషయమని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కార్మికులకు మేలు జరిగేలా రాసిన లేఖకు స్పందన లభించటం పట్ల పలువుల ప్రముఖులు ప్రశంసలు తెలిపారు.