728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 30, 2020

6 అడుగుల భౌతిక దూరం సరిపోదు.. 26 అడుగుల దూరం ఉండాల్సిందే!

లండన్‌:
★ కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రజల్ని కాపాడడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం భౌతిక దూరం.

★ ఇన్నాళ్లూ ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోతుందని అనుకుంటూ వచ్చాం.

★ కానీ ఆ దూరం సరిపోదని ఆక్స్‌ఫర్డ్, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.

★ కోవిడ్‌-19 రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పాడినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే కంటికి కనబడని తుంపర్లు కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని బీఎంజే జర్నల్‌లో ప్రచురితమైన ఆ సర్వే వెల్లడించింది.

★ వైరస్‌ బారిన పడిన వ్యక్తి మాట్లాడినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయని, అదే దగ్గడం, తుమ్మడం లేదంటే పాటలు పాడడం వంటివి చేసినప్పుడు ఏకంగా 26 అడుగుల దూరం ప్రయాణిస్తాయని ఆ సర్వే తేల్చింది.

★ అందులోనూ తలుపులన్నీ మూసి ఉంచిన ప్రదేశాలు, గాలి వెలుతురు రాని ప్రాంతాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

★ గతంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ, స్టాన్‌ఫార్డ్‌ యూనివర్సిటీల పరిశోధనల్లో 20 అడుగుల దూరం వరకు తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని వెల్లడైంది.

★ తాజా అధ్యయనంలో 26 అడుగుల వరకు తుంపర్లు ప్రయాణిస్తాయని వెల్లడి కావడంతో కోవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి భౌతిక దూరం నిబంధనలు మార్చాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 6 అడుగుల భౌతిక దూరం సరిపోదు.. 26 అడుగుల దూరం ఉండాల్సిందే! Rating: 5 Reviewed By: NEWS UPDATE