728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 30, 2020

పాత్రికేయుడు భూపతి శ్రీనివాసకు నివాళి అర్పించిన జర్నలిస్టులు

చిలకలూరిపేట: పట్టణ ప్రముఖ పాత్రికేయుడు భూపతి శ్రీనివాస రావు సంతాప సభను పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ లో నిర్వహించారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షుడు దండ గోపి, కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ ఏరియా కార్యదర్శి మోహన్ రావు, APUWJ స్టేట్ కౌన్సిల్ సభ్యులు మస్తాన్ వలి, నందిగం కోటేశ్వరరావు, శ్రీను నాయక్ , పలువురు పాత్రికేయులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని భూపతి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ భూపతి శ్రీనివాసరావు తలలో నాలుకలా ఉంటూ జర్నలిస్టుల కోసం పలు సమస్యలపై పోరాటాలు చేసారంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సేవలను గుర్తుపెట్టుకొని వారి కుటుంబాలకు ఆదుకోవాలని జర్నలిస్ట్ నాయకులు కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పాత్రికేయుడు భూపతి శ్రీనివాసకు నివాళి అర్పించిన జర్నలిస్టులు Rating: 5 Reviewed By: NEWS UPDATE