చిలకలూరిపేట: నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేవలం జూన్ నెలాఖరు లోపు 100 లోపు ఉన్న కరోనా కేసులు జూలై నాటికి సంఖ్య విపరీతంగా పెరిగింది. పట్టణంలో మొట్టమొదటిగా శివాలయం వీధిలో ఉన్న ఒక వైద్యురాలికి కరోనా పాజిటివ్ రాగా, నాదెండ్ల మండలంలోని చందవరం గ్రామంలో ఉన్న ఒక వృద్ధునికి కరోనా పాజిటివ్ వచ్చి మృతిచెందాడు.
అనంతరం నియోజకవర్గం మొత్తం మీద కేవలం 10 నుండి 20 లోపు కేసులు ఉన్న సంఖ్య ఈ రోజుకు గత నెల నుండి అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయింది. నేడు నియోజకవర్గ పరిధిలోని పట్టణంలో 453, కరోనా కేసులు, ఎడ్లపాడు మండలంలో 93, నాదెండ్ల మండలంలో 126, చిలకలూరిపేట మండలం గ్రామాల పరిధిలో 107 మొత్తం మీద ఈ కేసుల సంఖ్య 779 కు చేరింది అయితే అత్యధికంగా చిలకలూరిపేట పట్టణంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సంఖ్య నేటి వరకు 453 గా ఉంది.