728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 2, 2020

చిలకలూరిపేట పట్టణంలో రికార్డ్ స్థాయిలో 90 కరోనా కేసులు నమోదు

చిలకలూరిపేట: పట్టణంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తుంది. పట్టణంలో నేటి వరకు అత్యధికంగా 80 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ గత నెల 31వ తేదీన పట్టణంలోని రజక కాలనీలో 300 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఈరోజు 78 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది.

అలానే పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నరసరావుపేట, గుంటూరు తదితర చోట్ల చేయించుకున్న పరీక్షల్లో మరో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు పట్టణంలో వచ్చిన అత్యధికంగా నేడు ఒక్క రోజే 90 కేసులు నమోదు నమోదయ్యాయి. దీంతో పట్టణంలో ఈరోజు వరకు సుమారు 440 కేసుల వరకు నమోదయ్యాయి. ఈ సంఖ్య రెండు మూడు రోజుల్లో 500 కు చేరువ కానుంది.

చిలకలూరిపేట పట్టణం నరసరావుపేటతో పోటీపడి కేసులు పెరుగుతున్నట్లు పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిలకలూరిపేట మున్సిపల్ కోవిడ్ అధికారి సరైన చర్యలు చేపట్టకపోవటం వల్ల కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రికార్డ్ స్థాయిలో 90 కరోనా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE