★ కేరళలోని పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
★ ఇడుక్కి జిల్లా రాజమలలో భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి.
★ ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 60 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
★ ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
★ చిక్కుకున్న వారంతా తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులుగా గుర్తించారు.
★ ఐఏఎఫ్ సాయం కోరిన సీఎం.
★ ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
★ ఇడుక్కి జిల్లాలోని రాజమలలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్టు సీఎం పినరయి విజయన్ ట్విటర్‌లో వెల్లడించారు.
★ పోలీసు, అగ్నిమాపక దళం, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నట్టు చెప్పారు.
★ కొండ చరియలు విరిగిపడిన ప్రదేశంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించాలని విజయన్ భారత వైమానిక దళాన్ని కోరారు.

