చిలకలూరిపేట: పట్టణములో 12వ వార్డు(తూర్పు మాలపల్లె)లో గురువారం నాడు సి.పి.యం పార్టీ ఆధ్వర్యాయంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సంధర్భంగా సి.పి.ఎం. పార్టీ పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 26 వరకు ప్రజా సమస్యలు పరిష్కారం కొరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆదాయపు పన్ను పరిధిలో లేని ప్రతి కుటుంబానికి రూ. 7500/- లను ఆర్ధిక సహాయం, పేదవారికి 16 రకాలైన నిత్యావసరాలను 6 నెలలు ఇవ్వాలని, నిరుద్యోగ యువతి, యువలకు తక్షణమే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందిగా, భవన నిర్మాణ, రిక్షా, ఆటో, లైసెన్స్ కలిగిన డ్రైవర్లు అందరికి రూ10,000/- తక్షణమే ఆర్థిక సహయం చేయాలని, దళితులు, మహిళలు, గిరిజనులపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి, కరోనాభరిన పడి మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇంకా పలు డిమాండ్లతో కార్యాలయ ఎడ్యుకేషన్ సెక్రటరీ నాగుల మీరావలికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్.బాబు, చిన్న, ఫిరోజ్, శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.
August 20, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ప్రజల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

