728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 27, 2020

అక్రమ మద్యం, గుట్కా వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతాం: డీఎస్పీ వీరారెడ్డి

నర్సారావుపేట: గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు నర్సారావుపేట సమీపంలోని రావిపాడు వద్ద ఈరోజు తెల్లవారుజామున అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని తనిఖీ చేసినట్లు, వాహనంలో కూరగాయల కింద అక్రమ మద్యం, గుట్కా రవాణా చేస్తున్న ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్లు నరసరావుపేట డి.ఎస్.పి వీరారెడ్డి మీడియాకు తెలిపారు.

చిలకలూరిపేటకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని, వినుకొండకు చెందిన శ్రీనివాస్ రావు అనే ఇరువురుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 3లక్షల 75వేల రూపాయల గుట్కా ప్యాకెట్లు, 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

చిలకలూరిపేట పట్టణానికి చెందిన అన్నల దాసు, రవికాంత్ ఈ వ్యాపారం చేస్తున్నట్లు వారు తెలిపారు ఆరోగ్యానికి హాని కలిగించేవి ఎవరైనా విక్రయిస్తే అటువంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని అవసరం అయితే వారిపై షీట్లు ఓపెన్ చేస్తామని డి.ఎస్.పి అన్నారు. అక్రమ మద్యం వ్యాపారులకు ఎవరు సహకరించినా వారిని క్షమించే ప్రసక్తే లేదని డీఎస్పీ వీరారెడ్డి హెచ్చరించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అక్రమ మద్యం, గుట్కా వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతాం: డీఎస్పీ వీరారెడ్డి Rating: 5 Reviewed By: NEWS UPDATE