అమరావతి: నెల్లూరులో ప్రతి ఏటా జరిగే రొట్టెల పండుగను ఈ సారి ఆగస్ట్ 30 వతేది నుంచి 3 సెప్టెంబర్ వరకు జరుపుకుంటారు. అయితే కరోనా దృష్ట్యా రొట్టెల మార్పిడిని నిషేధించినట్లు దర్గా కమిటీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మొహరం పండుగ సందర్భంగా బారాషహీద్ గంధ మహోత్సవాన్ని ఆగస్ట్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించారు. ఈనెల 30వ తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కరోనా వైరస్ కారణంగా రొట్టెల పండుగ నిషేధం విధించడం వల్ల భక్తులు రావద్దని జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా వక్ఫ్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
August 28, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: నెల్లూరు బారాషహీద్ రొట్టెల పండుగ రద్దు
Rating: 5
Reviewed By: NEWS UPDATE
