చిలకలూరిపేట: నియోజకవర్గంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తుంది. చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తం మీద బుధవారం సాయంత్రం వరకు వచ్చిన టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం పట్టణంలో మొత్తం మీద 668 కరోనా కేసులు నమోదయ్యాయి.
చిలకలూరిపేట రూరల్, నాదెండ్ల, ఎడ్లపాడు మండలాల్లో 460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 1128 కేసులు నమోదు కాగా నియోజకవర్గం మొత్తం మీద చూస్తే చిలకలూరిపేట పట్టణంలో 60 శాతం, మూడు మండలాల్లో సుమారు 40 శాతం కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే పట్టణంలో అత్యధికంగా 668 కరోనా కేసులు నమోదు కావడం, రెండవ అత్యధిక సంఖ్య నాదెండ్ల మండలంలో 209 గా నమోదయింది. ఎడ్లపాడు మండలంలో 111, చిలకలూరిపేట రూరల్ మండలంలో 140 కేసులు నమోదయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో వారానికి రెండు సార్లు మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల అనేకమంది వైరస్ వచ్చిన వారు, అనుమానం ఉన్న వారు ఇబ్బందులు పడుతూ ఏదో ఒక మండలంలో పరీక్షలు నిర్వహిస్తున్న చోట వెళ్లి పరీక్షలు చేయించుకోవడం లేదా నర్సారావుపేట, గుంటూరును ఆశ్రయించ వలసి వస్తుంది. చిలకలూరిపేట పట్టణంలో ప్రతి రోజు ప్రభుత్వం ద్వారా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అని పలువురు భావిస్తున్నారు.