728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 18, 2020

కరోనా మహమ్మారి మరో దశలోకి: డబ్ల్యూహెచ్‌వో

జెనివా:
★ కరోనా వైరస్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది.

★ ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారిలో యువత ఎక్కువగా ఉన్నారని స్పష్టం చేసిది.

★ వీరి వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులకు కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

★ 20లు, 30లు, 40లలో ఉన్న వారికి కరోనా సోకినా.. వారికి ఆ విషయం తెలియడం లేదు.

★ కానీ వీరి వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

★ ‘కరోనా మహమ్మారి మార్పు చెందుతోంది. 20లు, 30, 40లలో ఉన్నవారి కారణంగా వైరస్ వేగంగా విస్తర్తిస్తోంది. ఈ వయస్కుల్లో చాలా మందికి తాము కోవిడ్ బారిన పడిన విషయం తెలియడం లేదు’ అని డబ్ల్యూహెచ్‌వో వెస్ట్రన్ పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ తకేషి కసయ్ తెలిపారు.

★ ఫలితంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

★ ఇలా జరగడం అంటే కేవలం కరోనా కేసులు పెరగడమే కాదు.. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో మహమ్మారి నూతన దశలోకి మనం అడుగుపెట్టాం అని కసయ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

మ్యూటేషన్లను పరిశీలిస్తే..
★ వైరస్ ఇప్పటికీ స్టేబుల్‌గానే ఉందని కసయ్ తెలిపారు.

★ వ్యాక్సిన్ తయారు చేసే సమయంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన తగిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా మహమ్మారి మరో దశలోకి: డబ్ల్యూహెచ్‌వో Rating: 5 Reviewed By: NEWS UPDATE