న్యూఢిల్లీ:
★ విశ్వవిద్యాలయాల ఫైనల్/చివరి సెమిస్టర్ పరీక్షల రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
★ విచారణను ఆగస్టు 10కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
★ కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్ధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, అందువల్ల పరీక్షలు నిర్వహించాలంటూ యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలను రద్దు చేయాలంటూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
★ దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించింది.
★ పరీక్షలపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అభిప్రాయం కూడా తీసుకుంటామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
★ బిహార్, అసోంల్లో వరదల కారణంగా విద్యార్ధుల చాలా ఇబ్బందులు పాలవుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
★ అయితే ఈ సమయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని.. తిరిగి ఈ కేసును ఆగస్టు 10న విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.