చిలకలూరిపేట: నియోజకవర్గంలో గత రెండు నెలల నుండి కరోనా కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే గత రెండు నెలల్లో అత్యంత తక్కువ కరోనా కేసులు నమోదయ్యింది ఈ రోజే అని చెప్పవచ్చు. చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటిదాకా రెండు నెలల నుండి కనీసం 1 నుండి 30 కేసులు వరకు నమోదయ్యాయి. కానీ నేడు మాత్రం వడ్డెర కాలనీలో ఒకే ఒక్క కేసు నమోదైంది. గత మూడు రోజుల నుండి పట్టణంలో రోజుకు ఒక కేసు మాత్రమే నమోదయ్యాయి.
అలానే నాదెండ్ల మండలంలో, చిలకలూరిపేట రూరల్ మండలంలో కూడా ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఎడ్లపాడు మండలం జలాది గ్రామంలో మాత్రం ఒకే ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదైంది గత మూడు రోజుల నుండి అత్యంత తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ రోజు మూడు రోజుల రికార్డు కన్నా అత్యల్పంగా నియోజకవర్గం మొత్తం మీద రెండు కేసులు మాత్రమే నమోదయిన రోజుగా గుర్తుంచుకోవాలి.