728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 21, 2020

ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు ఫెయిల్: రాధాకృష్ణ

చిలకలూరిపేట: పట్టణంలో పురపాలక అధికారులు, వైద్యాధికారులు ఇంటింటికి తిరిగి జ్వరాలపై అవగాహన కల్పించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాధాకృష్ణ కోరారు. నియోజకవర్గంలో కరోనా, సీజనల్ వ్యాధులకు తేడా చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు రాకుండా చేయాల్సిన బాధ్యత పట్టణంలో మున్సిపల్ అధికారులపై ఉందని వీరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పట్టణంలో నీటి కుళాయిల్లో మురికి నీరు వస్తుందని, లీకులు సరి చేయడంలో ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రాధాకృష్ణ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పురపాలక సంఘ ఆధ్వర్యంలో అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగా పురప్రజలకు ఉపయోగపడేలా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వీరు జిల్లా ఉన్నత అధికారులను కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు ఫెయిల్: రాధాకృష్ణ Rating: 5 Reviewed By: NEWS UPDATE