728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 25, 2020

అప్పటివరకు ప్రభుత్వం పాఠశాలలు తెరవకూడదు: టీడీపీ నేతలు

చిలకలూరిపేట: ప్రపంచంలో లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ దగ్గరలోనే సామాన్యులకు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, ప్రభుత్వం పాఠశాలను తెరిచే అంశాన్ని పునరాలోచన చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల అమెరికా, జర్మనీ దేశాలలో పాఠశాలలు ప్రారంభించిన కొద్ది రోజులకే వేల సంఖ్యలో విద్యార్థులకు వైరస్ సంక్రమించి, టీచర్లకు, విద్యార్థులకు వారి నుండి కుటుంబ సభ్యులకు వైరస్ సోకి సామాజిక సంక్రమణకు దారి తీసింది. పాఠశాలలో చిన్న తరగతుల పిల్లలకు వ్యాధి తీవ్రత అంశం పట్ల అవగాహన తక్కువగా ఉంటుంది కాబట్టి వైరస్ వ్యాప్తి వలన జరిగే నష్టాన్ని అంచనాకు కూడా అందని పరిస్థితి ఉంటుంది.

పాశ్చాత్య దేశాలలో తరగతి గదులు విస్తీర్ణం, తరగతి గదులలో విద్యార్థుల సంఖ్య విషయాలలో వారు ఖచ్చితమైన ప్రమాణాలు పాటిస్తారు. కానీ మన దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వ నిర్దేశిత నియమాల పరంగా ఒక్క పాఠశాల కూడా నిర్వహించని పరిస్థితి నెలకొని ఉన్నది.  ప్రమాణాలు పాటించే దేశాలలోనే పాఠశాలల విషయంలో చేతులెత్తేసిన స్థితి నెలకొంటే, క్లాసుకు 50 నుండి 100 మంది విద్యార్థులతో నడిపే మన పాఠశాలలో వైరస్ పూర్తిస్థాయి వ్యాక్సిన్ రాక మునుపే తరగతులు ప్రారంభిస్తే ప్రభుత్వం సామాజిక వ్యాప్తిని ఎలా నియంత్రిస్తుంది. ఒకవైపు విద్యార్థులు తల్లిదండ్రులు బడులకు పిల్లలు పంపాలో పంపకూడదో అర్థం కాని స్థితిలో ఉన్నారన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో మూడు లక్షల యాభై వేల కేసులకు చేరుకుని 4,000 మంది కరోనాకు బలి అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణలో వైఫల్యం చెందింది. వచ్చే నెల 5వ తేదీ నుండి పాఠశాలలు మొదలై  తద్వారా సామాజిక వ్యాప్తి ప్రబలితే ప్రభుత్వం ప్రజలను ఎలా కాపాడుతుందో, ఏం చర్యలు ఈ దశలో తీసుకుంటున్నారో ప్రజలకు తెలియ చేసి పాఠశాలలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కరోనాకు పూర్తిస్థాయి వ్యాక్సిన్ వచ్చాక పాఠశాలలు ప్రారంభిస్తే అందరికీ ఆమోద  యోగ్యoగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో షేక్ కరిముల్లా, పఠాన్ సమద్ ఖాన్, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మదన్ మోహన్, షేక్ అజారుద్దీన్, మురకొండ మల్లిబాబు పాల్గొన్నారు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అప్పటివరకు ప్రభుత్వం పాఠశాలలు తెరవకూడదు: టీడీపీ నేతలు Rating: 5 Reviewed By: NEWS UPDATE