చిలకలూరిపేట: రెండు మూడు నెలల కిందట ఎక్కడో ఒకరూ కరోనా బారిన పడితే అమ్మో... ఫలానా వారికి కరోనా వచ్చిందంటా.. ఆ వీధివైపు వెళ్లకూడదు.. అని భయపడేవారు. అందుకు తగ్గట్టే ఆ చుట్టపక్కల అరకిలోమీటర్ల వరకు రాకపోకలు నిరోధించటానికి బారికేడ్లు కట్టేవారు. ఎర్రటి అక్షరాలతో కంటైన్మెంట్ జోన్ అని రాసి టెంట్ వేసి కొంతమందిని కూర్చొబెట్టేవారు. ఈ క్రమంలోనే చుట్టుపక్కల వారికి కరోనా పరీక్షలు చేస్తారంటే.. ఏదో రకంగా తప్పించుకోవటానికే చూసేవారు.
కరోనా లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకోవటానికి, కోవిడ్ కేర్ సెంటర్‌కు వెళ్లటానికి ప్రజలు నిరాకరించేవారు. ఒకదశలో అయితే ఒక ప్రాంతంలో తాము కోవిడ్ కేర్ సెంటర్‌కు వెళ్లమని ఆందోళనకు దిగిన ప్రజలను పోలీసుల సహాయంతో తరలించారు. ఇదంతా గతం.. పట్టణం మొత్తం మీద వేళ్ల మీద లెక్కపెట్టుకొనే కరోనా కేసులు ఉన్న సమయం.
ఇప్పుడు...
పట్టణంలో ఎటుచూసినా కరోనా మహమ్మరి విజృంబిస్తోంది. కేసుల సంఖ్య పెరిగి ప్రజలు భయభ్రాంతులకు గురిఅవుతున్నారు. అప్పటిలా కంటైన్మెంట్ జోన్లు లేవు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రెండు మూడు రోజులు ఎదో అడ్డం పెట్టి బ్లీచింగ్ చల్లి పోతున్నారు. కొన్ని చోట్లైతే అది కూడా లేదు. నేడు, అతి వేగంగా కరోనా పట్టణంలో విస్తరించింది. వాడవాడల మహమ్మారి వ్యాప్తి చెందింది. చిన్నపాటి వైరల్ జ్వరాలకే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి మందులు కొనుగోలు చేస్తున్నారు.
విస్తరించిన కోవిడ్ నేపథ్యంలో పట్టణంలో రెండు వారాలు సంపూర్ణ లాక్‌డౌన్ కూడా అమలు చేశారు. అయినా మార్పులేదు. కరోనా సోకిన వారికన్నా కరోనా సోకిందేమో అన్న భయం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. గతంలో కరోనా పరీక్షలు అంటనే ప్రజలు ఉలికిపాటుకు గురయ్యేవారు. కోవిడ్ కేర్ సెంటర్, ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడేవారు...
ఆ పరిస్థితి నుంచి తమకు తాముగా పరీక్షల కోసం, ఆసుపత్రుల్లో చికిత్స కోసం స్వచ్చంధంగా బయటకు వస్తున్నారు. అయితే ఒకవైపు ప్రభుత్వం కూడా పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి పట్టణంలో, నియోజకవర్గంలో మొబైల్ వాహానం ద్వారా, ప్రత్యేక కేంద్రాల ద్వారా పరీక్షలు అందజేస్తున్నా.. అవి సరిపోవటం లేదు. పరీక్షలు చేయించుకోవాలను కున్నవారు వేల సంఖ్యలో ఉంటుంటే.. ప్రభుత్వం సరఫరా చేసే కిట్లు వందల సంఖ్యలో ఉంటున్నాయి.
దీంతో పాటు కోవిడ్ కేర్ సెంటర్‌లో సైతం బెడ్లు తక్కువగా ఉండటంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు, పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. కొద్దో గొప్పో డబ్బులు ఉన్నావారికి ఇవి అవకాశమే కాని, పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ పరిస్థితి ఆందోళనకు గురి చేస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే కరోనాను అరోగ్యశ్రీలో చేర్చింది. దీంతో పాటు నియోజకవర్గ పరిధిలో కరోనా పరీక్షలకు, చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి మంజూరు చేస్తే పరిస్థితిలో మార్చు వచ్చే అవకాశం ఉంటుంది. పేదల ఆరోగ్యానికి ఇది భరోసా కల్పించవచ్చు.