728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 23, 2020

అమరావతి రైతులను నక్సలైట్ల కంటే దారుణంగా చూస్తున్నారు: రావు సుబ్రమణ్యం

విజయవాడ: అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 250 రోజులకు చేరుకున్న సందర్భంగా అమరావతి జేఏసీ విజయవాడ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు పాల్గొని ప్రసంగించారు. రాజకీయ పార్టీలు, అమరావతి జేఏసీతో ముఖ్యమంత్రి జగన్ అఖిలపక్షం నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లుతో కూడా చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేసుకొని రైతులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలన్నారు. సి.ఆర్.డి.ఏ పరిధిలోని 3లక్షల 80 వేల ప్లాట్లు వేలానికి రావడానికి జగన్ వైఖరే కారణమన్నారు. గాంధేయ మార్గాన్ని వదిలి రైతులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి చేస్తే పరిస్థితి ఏమిటో జగన్ ఆలోచించుకోవాలి అన్నారు. అమరావతి ఉద్యమానికి నవతరం పార్టీ సంపూర్ణంగా మద్దత్తు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతి రావు, ఆర్వీ స్వామి, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి పి.మధు, ఆప్ రాష్ట్ర కన్వీనర్ భవాని వరప్రసాద్, పోతిన రామారావు, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, నవతరం పార్టీ వి.సాయి పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అమరావతి రైతులను నక్సలైట్ల కంటే దారుణంగా చూస్తున్నారు: రావు సుబ్రమణ్యం Rating: 5 Reviewed By: NEWS UPDATE