చిలకలూరిపేట: మునిసిపల్ కార్యాలయంలో వార్డు సచివాలయ అడ్మిన్ లు, వైద్య ఆరోగ్య అధికారులు, విఆర్వోలు, సిబ్బందితో మంగళవారం RDO వెంకటేశ్వర్లు సమావేశం వ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొవిడ్ భారిన పడిన వారు వైద్యం అందక మరణించారనే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల ఆరోగ్యస్థితిని తెలుసుకోవాలన్నారు. పల్స్ ఆక్సీ మీటర్ తో పరీక్షించాలన్నారు. గర్బిణిలు, 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు, 10 సంవత్సరాల లోపు చిన్నారులకు కొవిడ్ పరీక్షలు చేయించాలన్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని కొవిడ్ కేర్ సెంటర్, ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేందుకు మండలానికి ఒక ఆర్టీసీ బస్సు, 108 అంబులెన్సును కేటాయించడం జరిగిందన్నారు.
తహసిల్దార్ కార్యాలయంలో బస్సులు అందుబాటులో ఉంటుందన్నారు. ఇకపై బాధితులను ఆస్పత్రులకు తరలించి విషయంలో ఇబ్బంది ఉండదన్నారు. పట్టణంలో కొవిడ్ ట్రయాంగింగ్ సెంటర్ ప్రగతి నర్సింగ్ హోమ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇక్కడ ఏడు రకాల పరీక్షలు నిర్వహించి వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచేలా కొవిడ్ ఆస్పత్రులకు తరలించేలా అనేది అక్కడి వైద్యులు సూచిస్తారన్నారు.
పాజిటివ్ వచ్చిన వారిని ఈ సెంటర్ లో పరీక్షించే విధంగా వలంటీర్లు కృషి చేయాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి అరోగ్యస్థితిని కూడా వలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది పీహెచ్ సీ ఆసుపత్రులలో అధికారులు, సిబ్బంది, రికార్డుల నిర్వహణకు కంప్యూటర్ల కొరత, పీపీఈ కిట్ లు, శానిటైజర్, మాస్కులు, గ్లౌజుల కొరతను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.
హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడికల్ కిట్ అందించాలని కోరారు. ఆయా సమస్యలను పరొష్కరిస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. సమావేశంలో మునిసిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, నోడల్ వైద్యాధికారి డాక్టర్ గోపీనాయక్, తహశీల్దారు సుజాత, అర్బన్ ఎస్ఐ షేక్ మహ్మద్ షఫి, రూరల్ ఎస్ఐ ఎ భాస్కర్, డాక్టర్ కొల్లా అమర్ తదితరులు పాల్గొన్నారు.